నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సరళ రుణ కేంద్రాన్ని APGB చైర్మన్ సత్య ప్రకాశ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సర కాలంలో తమ బ్యాంకు రూ .47 వేల కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని అధిగమించిందని తెలిపారు. తమ బ్యాంకు ప్రధాన శాఖలలో సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి రుణ సదుపాయాలను కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు చైర్మన్ సత్య ప్రకాష్ సింగ్ పేర్కొన్నారు. నంద్యాల రీజనల్ మేనేజర్ పింగళి వెంకటరమణ మాట్లాడుతూ నంద్యాల రీజియన్ లో ఇప్పటికే మూడుసార్లు రుణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్ని ప్రధాన శాఖలలో కూడా ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు తమ బ్యాంకు సన్నాహాలు చేస్తున్నదని ఆయన అన్ని వాణిజ్య బ్యాంకులకు దీటుగా తమ బ్యాంకులో ఖాతాదారులకు పథకాలు ఉన్నాయని RM వెంకటరమణ తెలిపారు. ఖాతాదారులు తమ బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని రుణాలు కావలసినవారు దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మేనేజర్ సాయి కిరణ్,బ్రాంచ్ మేనేజర్ C. వెంకట శివారెడ్డి, మౌనిక, శశికళ, సాయి చందు, మునగలా సత్యనారాయణ బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
రూ.47 వేల కోట్ల లక్ష్యాన్ని అధిగమించిన ఆంధ్ర ప్రగతి బ్యాంక్ …
-APGB చైర్మన్ సత్య ప్రకాశ సింగ్
RELATED ARTICLES