రూ. 30 కోట్ల స్థిరాస్తి… తెర వెనుక చిత్ర విచిత్రాలు
-గవర్నర్ పేరిట స్థలాలను ఆక్రమించిన కత్తి శ్రావణిరెడ్డి
-క్షేత్రస్థాయి ఫిర్యాదుపై పోలీసుల సహాయ నిరాకరణ
-రిజిస్టర్ పోస్టుపై పోలీసు కేసు నమోదు
-కత్తి శ్రావణి ఆక్రమణలపై ఒక్కసారి పోలీసులకు ఫిర్యాదు
-తాజాగా ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన మార్కెట్ యార్డు చైర్మెన్ హరిబాబు
-డా.మధుసూదన్ రావుపై వైసీపీ సానుభూతి ముద్ర
నంద్యాల: నంద్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని రూ. 30 కోట్ల స్థిరాస్తి పై తెర వెనుక ఎన్నో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాత్తు రైతునగరం గ్రామానికి చెందిన మహిళ గుంటుపల్లె కోటేశ్వరమ్మ రాష్ట్ర అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పేరిట రిజిస్టర్ చేసిన స్మశాన వాటిక, దోభి ఘాట్లను కత్తి శ్రావణిరెడ్డి ఆక్రమించింది. ఇకపోతే కత్తి శ్రావణి భూ ఆక్రమణపై బాధితుడు డా. మధుసూదన్ రావు క్షేత్రస్థాయి ఫిర్యాదుపై పోలీసులు సహాయ నిరాకరణ చేసినట్లు బాధితుడు తెలిపారు. అదే ఫిర్యాదును రిజిస్టర్ పోస్టు ద్వారా పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత నెల 13న కత్తి శ్రావణి ఆక్రమణలపై మార్కెట్ యార్డు చైర్మెన్ ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నంద్యాల ఆర్డీవోకు హరిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు మరో ఫిర్యాదును అందజేశారు. కత్తి శ్రావణి తీవ్ర ఆరోపణలు చేస్తున్నా డా.మధుసూదన్ రావుపై వైసీపీ సానుభూతి పరుడన్న ముద్రను మూటకట్టుకున్నారు. రూ. కోట్ల విలువైన స్థలం పై చెలరేగుతున్న వివాదం వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై జిల్లా కేంద్రంలో చర్చ జరుగుతుంది. భూ వివాదం రాజకీయ మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కత్తి శ్రావణి పాత్రికేయుల సమావేశంలో డా. మధుసూదన్ రావుతోపాటు ఆయన బావమరిది బొగ్గరపు నాగరాజును లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. బొగ్గరవు నాగరాజుకు జిల్లాకు చెందిన వైసీపీలోని కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండటమే రాజకీయ మలుపుకు ప్రధాన కారణంగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్న నేపథ్యంలో అందిస్తున్న కథనం ఇది.
డా. మధుసూదన్ రావు ఎన్నో ఏళ్ళుగా వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారి తల్లిదండ్రుల జాపకార్థం ప్రతి ఏడాది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు పేద ఆర్యవైశ్యులకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో వైద్య రంగంలోని కొందరు తమకు ఇష్టమైన వ్యక్తులకు తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తారన్నది బహిరంగ రహస్యం. డా. మధుసూదన్ రావు శిల్పా, కాటసాని, పోచా కుటుంబీకులతో మంచి పరిచయం ఉంది. ముగ్గురు నేతలు ఒక్కప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడే భూ వివాదం రాజకీయ మలుపుకు ఒక వేదికగా కనిపిస్తుంది. గత నెల 13న కత్తి శ్రావణిరెడ్డి తన అంగబలంతో డా. మధుసూదన్ రావు ఆధీనంలోని కొంత భూమిని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే విషయంపై డా. మదుసూదన్ రావు పోలీసులకు క్షేత్ర స్థాయిలో ఫిర్యాదు చేసినా ఆ
ఫిర్యాదును తీసుకోలేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. మార్కెట్ యార్డు చైర్మెన్ గుంటుపల్లి హరిబాబు అదే పోలీసుస్టేషన్ లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదుల్లో స్థలం వద్దకు కత్తి శ్రావణి, ఆమె అనుయాయులు వచ్చిన, వినియోగించిన వాహనాల నెంబర్లను పొందు పరుస్తూ ఫిర్యాదు చేశారు. అదే ఫిర్యాదులో అడ్డుకోబోయిన గ్రామస్తులను రాడ్లు, కత్తులతో బెదిరిస్తూ దౌర్జన్యంగా ముందుకు వచ్చిన అంశాలను పొందు పరచారు. చివరకు అటు వైపు వస్తే చంపేస్తామని బెదిరిస్తూ నానా దుర్భషలాడినట్లు ఫిర్యాదులో పొందు పరిచారు. తాజాగా రైతునగరం 22వ వార్డు ప్రజలు ఆర్డీవో విశ్వనాథ్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కోటేశ్వరమ్మ గవర్నర్ పేరుతో రిజిస్టర్ చేసిన 16 సెంట్ల దోభి ఘాట్, 30 సెంట్ల స్మశాన వాటికను కత్తి శ్రావణిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు కలసి స్మశానం, దోబిఘాట్ల స్థలాలు మా పూర్వికులవని కంచె వేసి గ్రామస్తులను బెదిరిస్తూ అక్కడ కాపలాగా కొందరిని పెట్టారని పొందు పరిచారు. చివరికు మృతి చెందిన శవాలను కాల్చన్వివకుండా బెదిరించినట్లు పొందు పరిచారు. కబ్జాదారుల నుంచి గ్రామ స్మశానాన్ని కాపాడాలని కోరారు. గ్రామస్తుల ఫిర్యాదుపై రెవెన్యూ రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించాలని నంద్యాల అర్బన్ తహశీల్దార్ పత్తి శ్రీనివాసులును ఆర్డీవో ఆదేశించారు. డా.
మధుసూదన్ రావు అంశంలో క్షేత్రస్థాయి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా కనిపిస్తుంది. అదే ఫిర్యాదును రిజిస్టర్ పోస్టులో సంబంధిత పోలీసు అధికారులకు డా. మధుసూదన్ రావు ఫిర్యాదును పంపడంతో గత నెల 17న కత్తి శ్రావణి,
వేణుగోపాల్ రెడ్డిలపై వివిధ సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. డా.మధుసూదన్ రావు, హరిబాబు ఫిర్యాదులపై పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే భూ వివాదం ఇంత వివాదాస్పదంగా మారే అవకాశం ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. కోర్టులో కత్తి శ్రావణిరెడ్డి కేసు వేసి ఆమె డా.మధుసూదన్ రావుకు చెందిన కొంత స్థలంతోపాటు స్మశాన వాటికను ఆక్రమించడాన్ని అటు గ్రామస్తులు, ఇటు వైద్యుడు తప్పుబడుతున్నారు. రూ. కోట్ల విలువైన స్థలంపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతున్నా అధికార యంత్రాంగం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆర్డీవో ఆదేశాలతో సర్వే నెంబర్ 110పై పూర్తి స్థాయి నివేదికను రూపొందించే పనిలో అర్బన్ తహశీల్దార్ కార్యాలయం నిమగ్నం కావడం కొసమెరుపు.







