TEJA NEWS TV
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం సమీప నల్లమల అటవీ ప్రాంతంలో జోరుగా సాగిస్తున్న నాటు సారా తయారీ కేంద్రాలను ఆదివారం నాడు పోలీసులు దాడులు నిర్వహించి నాటు సారా బట్టిలను ధ్వంసం చేసినట్లు రుద్రవరం ఎస్ఐ యు.వి వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరి నగరం సమీపంలోని నల్లమల ప్రాంతంలో నాటు సార తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నాటు సారా తయారు చేయడానికి 10 డ్రమ్ముల్లో సిద్ధంగా ఉంచిన 1800 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రుద్రవరం మండలంలో జోరుగా నాటు సారా తయారీ..ధ్వంసం చేసిన ఎస్ఐ
RELATED ARTICLES