TEJA NEWS TV
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆలమూరు సమీపంలో పేకాట ఆడుతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యువి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆలమూరు గ్రామం వెలపల గల మొక్కజొన్న తోట వద్ద అందర్-బహార్ ఆడుతున్నారని సమాచారం రావడంతో ఇబ్బందితో కలిసి దాడులు నిర్వహించమన్నారు. ఇందులో భాగంగా 4 గురును అరెస్టు చేసి వారి వద్ద 41240/- నగదు ఆరు సెల్ ఫోన్లు మరియు ఎనిమిది బైక్ లను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.అనంతరం పేకాట ఆడుతున్న నేరస్థలం నుంచి 5 మంది వ్యక్తులు పారిపోవడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రుద్రవరం: పేకాటరాయుళ్లు అరెస్ట్… నగదు, డబ్బు,వాహనాలు సీజ్
RELATED ARTICLES