TEJA NEWS TV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం పంచాయతీలో జరిగిన నిధులు దుర్వినియోగం మొత్తం Rs 2,13,83,297/- పై ఈవో సుబ్బారావు ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అలాగే సర్పంచ్ పై సస్పెన్షన్, మరియు పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం దుర్వినియోగం అయినా నిధులను రికవరీ ఆదేశాలు జారీ అయ్యాయి.అవినీతిలో భాగస్వాములైన పంచాయతీ సెక్రెటరీల అందరూ సస్పెన్షన్ కి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి జరిగిన కాలంలో పర్యవేక్షించిన స్పెషల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.అలాగే పర్యవేక్షణ లో నిర్లక్ష్యం వహించిన EO (PR&RD), DLPO పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది.గత నాలుగు సంవత్సరాలు సక్రమ తనిఖీ నిర్వహించని ఆడిటర్ ఆఫీసర్లు అందరిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.ఈ స్కాంలో భాగస్వాములైన సర్పంచ్ మరియు అధికారుల వివరాలు వారిపై తీసుకున్న చర్యలు, రికవరీ చేయాల్సిన మొత్తం సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను 1/7/2025 తేదీ నుండి రెండు వారాల లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ గారికి పంచాయతీరాజ్ కమిషనర్ గారు 01/07/2025 తేదీన ఆదేశాలు జారీ చేశారు.
రుద్రవరం పంచాయతీలో జరిగిన నిధులు దుర్వినియోగం లో ఈవో సుబ్బారావు సస్పెండ్
RELATED ARTICLES



