ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
గత ఐదు సంవత్సరాలుగా నందిగామలో నిద్రమత్తులో మునిగిన పిడబ్ల్యుడి అధికారులు ఎట్టకేలకు నిద్ర లేచారు. నందిగామ రైతుపేట డౌన్ లో పిడబ్ల్యుడి కాలువ భూములను విలేకరులకు అప్పటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఓరల్ గా కేటాయించిన ఆక్రమించిన భూముల్లో నిర్మాణాలను కూల్చి వేశారు. అయితే దశాబ్ది కాలంగా ఇదే కాలువను పూడ్చి రియల్ ఎస్టేట్ ప్లాట్ వేసిన కుమార స్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. అంతేకాకుండా తమ ప్లాట్ లకు ఇబ్బంది రాకుండా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా పిడబ్ల్యుడి కాలువ పైనే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇది బహిరంగంగానే అందరికీ కనిపిస్తుంది. అలాగే ఆ విగ్రహాం ముందుకు పోయే కొద్దీ పిడబ్ల్యుడి కాలువ ఉంది. అది ఎప్పుడో కనుమరుగు అయింది. అలాగే విగ్రహం ముందు రోడ్ కు ఆనుకుని దాదాపు ఇరవై రెండు సెంట్లు భూమి ఉంది. ఇది ప్రస్తుతం ఒక ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములను రక్షించే పిడబ్ల్యుడి అధికారులు ఈ వ్యవహారంలో కాలక్షేపం చేయడం, కేవలం విలేకరులకు గత అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఓరల్ గా కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడం వెనుక రాజకీయం ఉందనే విషయం బహిరంగంగానే చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే కనీసం బుధవారం నాడు అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిలో కనీసం ఇది పిడబ్ల్యుడి కాలువ స్థలాం అని బోర్డు ఏర్పాటు చేయకపోవడం ఆ శాఖ అధికారుల పని తీరుకు నిదర్శనం
రియల్ ఎస్టేట్ పంజా
RELATED ARTICLES