రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో సత్తాచాటిన డి. సుప్రిత
జాతీయ స్థాయి రగ్బీ క్రీడా జట్టుకు ఎంపిక
వరదయ్యపాళెం జడ్పి హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న డి.సుప్రిత
ప్రత్యేకంగా అభినందించిన స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నాయకులు
రూ”5 వేలు ఆర్థిక బహుమతి అందించిన చిన్నపాండూరు ఉపసర్పంచ్ దేవళ్ళ మహేంద్ర*
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటుగా క్రీడా నైపుణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయుల కృషికి నిదర్శనంగా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రభుత్వ బడి పిల్లలు
ప్రతిభ కనబరుస్తూ తోటి బాలబాలికలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
10వ తరగతి చదువుతున్న
డి.సుప్రిత గత వారం కర్నూలు కేంద్రంగా జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ క్రీడా అండర్-19 పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటుకుంది.
డిశంబరులో మహరాష్ట్ర లోని పూణే లో జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ క్రీడా పోటీలలో పాల్గోనున్న జట్టుకు
ఎంపిక అయింది.
ఈనేపధ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,
స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి విద్యార్థిని డి.సుప్రితను
శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు.
భవిష్యత్ లో డి. సుప్రితకు ఎలాంటి సహాయ సహకారములు కావాల్సి వచ్చినా తోడ్పాటును అందించుటకు తాము సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కోన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు,
అధ్యాపక బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు
బందిలి సురేష్ లు విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే చిన్నపాండూరు ఉపసర్పంచ్ దేవళ్ళ మహేంద్ర
తనవంతు సాయంగా రూ” 5 వేలు చెక్కును ఆర్థిక బహుమతిగా అందించి అభినందనలు తెలిపారు.
విద్యార్థిని సుప్రిత మరెన్నో విజయాలను సాధించి
అటు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు
మంచి పేరును తీసుకురావాలని మనసారా కోరుకుందాం.
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో సత్తాచాటిన డి. సుప్రిత – జాతీయ స్థాయి రగ్బీ క్రీడా జట్టుకు ఎంపిక
RELATED ARTICLES