శ్రీసిటీ అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,”ఈ మెగా ఇండస్ట్రీల్ పార్క్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని”, రాష్ఠ్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొనియాడారు. ఇంతటి బృహత్తర పారిశ్రామిక వాడను తీర్చదిద్ది, సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మేనేజ్ంగ్ డైరక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సేవలను ఆయన ప్రశంసించారు. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించిన రవీంద్ర దేశ సేవలో తరిస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా పలు పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. శనివారం శ్రీసిటీని సందర్శించిన కొమ్మినేని, 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు శ్రీసిటీలో యేర్పాటవ్వడం హర్షణీయమన్నారు. దేశంలో పెట్టుబడులకు అనువైనవిగా విదేశీ పారిశ్రామిక వేత్తలు భావించే 10 ముఖ్య ప్రాంతాల్లో శ్రీసిటీ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఇక్కడ నిర్వహించబడుతున్న వివిధ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 60 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయన్నారు. పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల యువతకు తమ పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో విస్తరించిన శ్రీసిటీలో పర్యావరణ, పారిశుధ్య ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం ఆదర్శప్రాయమని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రవీంద్ర సన్నారెడ్డిని కొమ్మినేని దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీసిటీ యేర్పాటు ప్రతిపాదించి, స్వయంగా ప్రారంభించిన సంగతిని ఛైర్మన్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డా. వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన పారిశ్రామిక వాడలు అమలయ్యి పారిశ్రామిక అభివృద్ధి జరిగి వుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వుండేవని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యేదని ఆయన అన్నారు. శ్రీసిటీని సందర్శించిన కొమ్మినేనికి రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒ.ఎస్.డి. ఎస్.శ్రీనివాస జీవన్, శ్రీసిటీ జిఎం రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి మరిన్ని శ్రీసిటిలు కావాలి-ఏపీ ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
RELATED ARTICLES