Sunday, January 18, 2026

రాష్ట్రంలో వాటా కోసమే ముదిరాజుల కొట్లాట –  కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్

TEJA NEWS TV TELANGANA
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల జలల్పూర్ గ్రామంలో ముదిరాజ్ రాజకీయ చైతన్య సమావేశంలో పాల్గొని ముదిరాజ్ జండాను జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ ఆదివారం,ఆవిష్కరించారు. గ్రామంలో  డీజే పాటలతో ముదిరాజ్ ల ఐక్యత నినాదలతో టప్పాసులమొతలతో ర్యాలీ మారు మోగింది.   గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సరైన న్యాయం జరగడం లేదని, అన్ని రకాలుగా ముదిరాజులకు అన్యాయమే జరుగు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మనమేంతో మనకంత  “వాటా”కోసమే ముదిరాజుల కొట్లాట అని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజులకు రావాల్సిన ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉపాధి ఉద్యోగాలలో “వాటా” కోసమే ముదిరాజ్ మహాసభ నిరంతరం, ఉద్యమిస్తుందన్నారు.
కామారెడ్డి జిల్లాలో ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.. కొరివి నర్సింలు బిబిపేట్ మండల్ నుండి మాట్లాడడంగ్రామ, గ్రామాన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటును ప్రభుత్వమే చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మత్స్య శాఖ కమిషనర్ ఆదేశాలు జారిచేశారని తెలిపారు.
ప్రతీ ముదిరాజ్ కుటుంబం తమ పిల్లలను  ప్రభుత్వ గురుకులాల్లో చదివించేలా,ప్రయత్నించాలని కోరారు. ఇందుకు ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ప్రోత్సహించాలని సూచించారు. చదువుతోనే సంస్కారం, ఆర్ధిక ప్రగతి, రాజకీయ చైతన్యం,కల్గుతుందన్నారు. గ్రామంలోని అన్ని కులాలతో మన కొట్లాట కాదని అందరితో కలిసి-మెలిసి ఉంటూ రాజకీయ అధికారాన్ని ఛేజిక్కించు కోవాలని జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ కోరారు.

పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణనికి ప్రతీ గ్రామానికి 50/- లక్షల రూపాయకు మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్ని,  డిమాండ్ చేశారు.

ఓటు హక్కు తోనే ప్రభుత్వంలో మన వాటా సాదించుకోవచ్చని, రాబోయే ఎన్నికల్లో మన ఓటు.. మన నాయకున్ని ఎన్నుకోవడానికే సోయితో పని చేయాలనీ సూచ్చించారు.

ప్రతీ ముదిరాజ్  బిడ్డ రాజకీయ చైతన్యం తో పని చేసిన రోజే గ్రామం నుండి అసెంబ్లీ వరకు “వాటా”ను  మనం పొందడానికి ఉద్యమించాలని, వ్యూహంతో పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తూర్పు రాజులు ముదిరాజ్ నాగిరెడ్డిపేట మండల మహాసభ అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు ప్యాలాల రాములు ముదిరాజ్, యువత కన్వీనర్ సంతోష్ ముదిరాజ్, గాందరి సొసైటీ డైరెక్టర్ బాబా ముదిరాజ్, రవి ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నారాయణ ముదిరాజ్, గ్రామ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, మహిళలు, యువత, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular