భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
23-1-2025
చండ్రుగొండ
చండ్రుగొండ మండలపరిధిలో గల రావికంపాడు గ్రామంలో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తామని గ్రామ శాఖ అధ్యక్షుడు బొగినబోయిన కోటేశ్వరరావు ప్రజల ముందు వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరావు మాట్లాడుతూ బి. ఆర్. ఎస్ పార్టీ వారు మాయమాటలు చెప్పి పది సంవత్సరాలు పాలించారు. మా గ్రామానికి ఒక డబల్ బెడ్ రూమ్ కానీ, రేషన్ కార్డ్ గాని మంజూరు చేయలేదని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. అశ్వరావుపేటనియోజకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ మా గ్రామం పై చూపించిన శ్రద్ధకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
రావికంపాడు గ్రామంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం – కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోగినబోయిన కోటేశ్వరరావు
RELATED ARTICLES