Tuesday, December 9, 2025

రావికంపాడు గ్రామంలో ఘనంగా 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ



కష్టపడిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుంది – రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్

చండ్రుగొండ, ఆగస్టు 10:
చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 65వ భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ – యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయడం తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. కృషి చేసిన వారిని పార్టీ ఎప్పటికప్పుడు గుర్తించి, భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

వేడుకల్లో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బోగినబోయిన కోటేశ్వరరావు, యాదవ సంఘం నాయకులు కుక్కల ముత్యాల రావు, జారే ఆదినారాయణ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular