*సంగెం మండలం తో పాటు 17వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ,బూత్ స్థాయి నాయకులతో నర్సంపేట రోడ్ లోని ఊకల్ వద్దగల SS గార్డెన్స్ లో శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పోలింగ్ బూత్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోలింగ్ బూత్ ల వారిగా సమీక్షించారు. అనంతరం.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఎన్నికలలో తన గెలుపు కోసం పట్టుదలతో కసితో పని చేసిన కార్యకర్తలను, నాయకులను అభినందించారు.ఇదే పట్టుదల కసితో రాబోయే పార్లమెంట్
గత 10సంవత్సరాల బీఆర్ఎస్ దుర్మార్గపు పాలన చేసిందని అభివృద్ధి పేరిట అందినంతా దోచుకుని వేల కోట్లు కెసిఆర్ కుటుంబం సంపాదించారని, బీ ఆర్ ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని కార్యకర్తలపై దాడులు చేసిన భయపెట్టిన కేసులు పెట్టిన భయపడకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో కష్టపడ్డారని వారి సేవలను మర్చిపోనని అన్నారు. కార్యకర్తల కష్టంకు తోడు బీ ఆర్ ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం రాష్ట్రంలో మార్పు కోరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలు బీ ఆర్ ఎస్ ను బొండపెడుతారని బీజేపీని తరిమి కొడతారని ప్రజల ఆశీస్సులతో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుందని వరంగల్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుంటే మరిన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపిటిసి లు, సర్పంచులు, ,సీనియర్ ముఖ్య నాయకులు, నాయకురాలు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతీ బూత్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లక్ష్యంగా ఐక్యతతో పని చేయండి -ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు
RELATED ARTICLES