TEJA NEWS TV : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దుగ్గొండి మండలంలో బీజేపీకె మెజారిటీ స్థానాలు – వరంగల్ జిల్లా నాయకులు డా,,గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు.
ఈరోజు దుగ్గొండి మండలం గిర్నిబావిలో బిజెపి దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుగ్గొండి మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వరంగల్ జిల్లా నాయకులు డా,,గోగుల రాణా ప్రతాప్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో డా,,గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎ
న్నికల్లో సత్తా చాటాలి, దాని కోసం బిజెపి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని తెలియజేయడం జరిగింది. పార్టీ కోసం అహర్నిషలు కష్టపడి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే నర్సంపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో యువతకు పెద్ద పీఠం వేసి, యువతను ప్రజాప్రతినిధులుగా తయారు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాం అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి , కార్యవర్గ సమావేశ ఇన్చార్జి ఇంచార్జ్ బానోత్ చిన్న , మండల సీనియర్ నాయకులు అన్న లింగన్న మరియు భూసాని రమేష్ , యువ మోర్చా నియోజకవర్గ ఇన్చార్జ్ కొంకిస విగ్నేష్ గౌడ్ , ఐటి & సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ కోమండ్ల సప్తగిరి రెడ్డి , బీజేవైఎం మండల అధ్యక్షులు ఈర సందీప్ , నూతన కంటి శ్రీనివాస్ గారు, ఎడ్ల శశిధర రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.