TEJA NEWS TV
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు లీగల్ చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రేణుక ప్రారంభించారు. ఈ సదస్సులో ఏటూర్ నాగారానికి చెందిన ప్రముఖ అడ్వకేట్ శ్రీ వైద్యుల వెంకటేశ్వర్లు హాజరయ్యారు, వారు మాట్లాడుతూ విద్యార్థులు పలు శాఖలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా న్యాయ చట్టాల పై అవగాహన ఈ రోజుల్లో ఎంతో అవసరం అని తెలిపారు, ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ప్రతి రంగంలోనూ రాణించవచ్చు అని నవ భారతం నిర్మాణానికి చట్టాలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సంధానకర్త సిహెచ్ వెంకటయ్య, జ్యోతి(IQAC), కనీస్ ఫాతిమా, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి కే. రమేష్, జీవ వేణి, సంపత్, తదితర అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో లీగల్ అవగాహన సదస్సు
RELATED ARTICLES