రాజంపేట ఎమ్మెల్యే గారి కార్యాలయం
🇮🇳77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారి కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగినది
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
యాంకర్ వాయిస్
ఈరోజు రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారి కార్యాలయం నందు మేడా అభిమానులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ మండల అధ్యక్షులు జెసిఎస్ కన్వీనర్లు డైరెక్టర్లు మహిళా అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యి జాతీయ జెండాను ఎగరవేశారు
అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం , స్వాతంత్ర్య భారతం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు. అనేక మతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా మారిన భారత దేశ ప్రతిష్టను, సమున్నత కీర్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ,లక్ష్యాలను సాధించేందుకు కృషిj చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల మరియు పట్టణ కన్వీనర్లు జె సి ఎస్ కన్వీనర్లు రాష్ట్ర డైరెక్టర్లు మహిళా అధ్యక్షురాలు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు యువత మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.