*_రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రం_*
👉 *_ఉన్నతి మహిళా శక్తి పధకం ద్వారా ఆటోలు పంపిణీ._*
👉 *_రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు_*
ఉన్నతి మహిళా శక్తి పధకం ద్వారా మంజూరైన 4 ఆటోలను రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి గారు గురువారం పంపిణీ చేశారు.
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
ఒంటిమిట్ట మండల కేంద్రం నందు లబ్ధిదారులు చింతకాయల వెంకటసుబ్బమ్మ మహీంద్రా ఆటో, యాకసిరి ఆదిలక్ష్మి మహీంద్రా ఆటో, సిద్దవటం మండలం కల్లోజీ. ఇందిర, ప్రసన్న కుమారి బజాజ్ ఆటో పంపిణీ చేయడం జరిగినది.మహిళల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు 4 ఆటోలో మొదటగా ప్రాయాణించి టికెట్ చెల్లించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉన్నతి మహిళా శక్తి పధకాన్ని ప్రవేశపెట్టారన్నారు. లబ్ధిదారులు ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే శక్తి కార్యక్రమం కింద మహిళలకు చెల్లిస్తే సరిపోతుందని, మిగతా 90 శాతం రుణం సెర్ఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందులో భాగంగా నిరంతరం ఆదాయం పొందేలా చేయూత నిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై ఎలాంటి భారం పడకుండా రుణాలు చెల్లిస్తూ సొంత కాళ్లపై నిలబడేందుకు ఉన్నతి మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారన్నారు. దీని ద్వారా ఆటోలు ఇవ్వడం జరుగుతుందన్నారు
.ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటీ వేణుగోపాల్ రెడ్డి గారు ,ఒంటిమిట్ట మండల వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్ రెడ్డి గారు, చింతరాజు పల్లి రమణ నాయుడు గారు, ఎంపీటీసీ నారాయణ రెడ్డి గారు, పిడుగు సుబ్బారెడ్డి గారు, కట్టా నారాయణ గారు, భాస్కర్ గారు, సలాబాద్ కృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపిటిసి శ్రీనివాసులు రెడ్డి గారు, మట్లి నారాయణరెడ్డి గారు, మనుబోలు వెంకటసుబ్బయ్య గారు, గంగ పేరూరు కృష్ణారెడ్డి గారు, విశ్వనాథరెడ్డి గారుమరియు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: ఉన్నతి మహిళా శక్తి పధకం ద్వారా ఆటోలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి
RELATED ARTICLES