తేజ న్యూస్ టీవీ రిపోర్టర్ దాసరి శేఖర్
స్థలం రాజంపేట
యాంకర్ వాయిస్
నేడు 17-12-2023వ తేదీ ఆదివారం నాడు రాజంపేట పట్టణం బత్యాల భవన్ లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారి అధ్యక్షతన లీగల్ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు తరిగోపుల లక్ష్మీనారాయణ మరియు లీగల్ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు కొమ్మినేని వెంకటసుబ్బయ్య గార్ల ఆధ్వర్యంలో “న్యాయవాదుల ఆత్మీయ సమావేశం” నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వ విధానాల పై పాల్గొన్న న్యాయవాదులతో చర్చించారు.
ప్రధానంగా సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ సామాన్య ప్రజలు, ప్రతిపక్షాల పై ఉపయోగించి వారిని అనగదొక్కుతున్నారు.
అదేవిధంగా ఈ మధ్య కాలంలో అమలులోకి తీసుకువచ్చిన యాక్ట్ 27 ఆఫ్ 2023 మరీ దారుణమని ఇది కేవలం వైసీపీ నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం తీసుకువచ్చారని. దీని వలన సామాన్య, మధ్యతరగతి ప్రజలు వారి భూముల పై హక్కును కోల్పోవడమే కాకుండా తమ న్యాయం కోసం క్రింది న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉండదన్నారు
ఈ సమావేశం అనంతరం న్యాయవాదులు అందరూ కలిసి బత్యాల గారిని శాలువాలు వేసి గజమాలతో ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, రైల్వేకోడూరు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వెంకట్ రాజు, కరుణాకర్ రాజు, నాయక్, మన్నేరు వెంకటసుబ్బయ్య, బి. రమేష్ నాయుడు, జి రామచంద్ర నాయుడు, పి హనుమంతు నాయుడు, కె.వి రమణ, పి రామాంజనేయులు, డి వెంకటసుబ్బయ్య, ఎస్ నాసరుద్దీన్, ఎస్ రామచంద్ర రాజు, కొమ్మినేని కృష్ణయ్య, పుష్పలత, గీతాంజలి, వి.వి రమణ, చంద్రశేఖర్, పి ఆనంద్ కుమార్, కత్తి సుబ్బరాయుడు, కొమ్మినేని శివ, పిడుగు శ్రీకాంత్, షాహిద్, బోనం అక్షయ్ కుమార్, రామరాజు, మహబూబ్ బాషా, సుబ్బరామ యాదవ్, కోటేశ్వరరావు, రెడ్డి శివ, నాగ కిషోర్, పుల్లంపేట సురేష్, రోల్లమడుగు శంకరయ్య, రవిశంకర్, పెంచలయ్య, టి సూర్యచైతన్య, ప్రేమ్ కుమార్ ఇంకా పలువురు న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజంపేటలో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల
RELATED ARTICLES