Teja news tv
ఆళ్లగడ్డ నియోజకవర్గంచాగలమర్రి మండలంలోనిడి. వనిపెంట గ్రామంలో బుధవారం పంటల సాగులో రసాయనిక ఎరువులు వాడడంపై విన్నూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి మార్కెట్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బిల్లా రాజేష్ యాదవ్ , సెల్స్ ఆఫీసర్ మస్తాన్, ఫీల్డ్ అసిస్టెంట్ నాయక్ ల ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులు రసాయన ఎరువుల వాడకం పైరైతు సదస్సును కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెైతులు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు రసాయనిక ఎరువులు వాడటం ద్వారా ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గిపోతాయన్నారు . ఇది ముఖ్యంగా మానవ జంతువాళికి ముప్పును కల్పిస్తాయని పర్యావరణ కలుష్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ అన్ని గ్రామాలలో రైతు సదస్సులు నిర్వహించి రైతు లకు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులను గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు వాడడం వల్ల రైతులకు పంటలకు పెట్టె పెట్టుబడులు తగ్గిపోవడంతో పాటు అధిక దిగుబడులను సాధించ వచ్చని అన్నారు. “వినూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి” వారు రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ CMS, జీవన్ గోల్డ్, రైతుమిత్ర, ప్రణయ్, గ్రో హై గ్రాన్యూల్స్, గ్రో హై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్, యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ II, టర్బో II, కే జి ఎఫ్ 6, రోషిని, ఉజ్వల్ II, త్రిసూల్, ధర్మవీర్ , రత్నా, పృధ్వీరాజ్, తిరంగా, నైట్స్, త్రిలోక్, ఇగ్నిస్ 5 అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ (కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సంవత్సరాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తున్నదని ఆయన తెలిపారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై రైతు అవగాహన సదస్సు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, సేల్స్ ఆఫీసర్, మస్తాన్, ఫీల్డ్ అసిస్టెంట్ నాయక్ , గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.
రసాయన ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు..విన్నూత్న ఆగ్రో టెక్ఆధ్వర్యంలో రైతు సదస్సు…
RELATED ARTICLES