ఇటివల ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన కుటుంబానికి గీసుకొండ పోలీసులు ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే గీసుగోండ మండలం మొగిలిచర్ల (గోపాల్ రెడ్డి నగర్) కు చెందిన భవన కార్మికుడు ఉడత శివ ఆత్మహత్య చేసుకోగా, ఆదివారం గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్ కుమార్ ఆధ్వర్యంలో మృతుని కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేశారు. భవన కార్మికుడు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా కుటుంబము రోడ్డున పడింది. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యజమాని మృతితో అనాధలైన కుటుంబాన్ని పోలీసులు మానవత్వం చూపించి ఐదు వేల ఆర్థిక సహాయం, అలాగే నిత్యవసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆవేశంతో ఉడత శివ ఆత్మహత్య చేసుకోవడంతో తన కుటుంబమంతా రోడ్డున పడిందని, ఇలాంటి ఘటనలు మరి ఎక్కడ జరగకుండా ఎన్ని అవంతరాలు, బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన అన్నిటిని తట్టుకొని నిలవవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ కలహాలతో ఎవరు కూడా అఘాయిత్యాలు చేసుకోకూడదని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
రక్షణలోనే కాదు, సహాయంలో కూడా ముందు వరుసలో ఉన్న గీసుగొండ పోలీసు అధికారులు
RELATED ARTICLES