ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని హోటల్ ఫేవరెట్ ప్రాంగణంలో యోగా శిక్షణా కేంద్రం ప్రారంభించిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పండుదొర, అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి జీవన విధానంలో యోగా ముఖ్యమైన అంశమని,యోగా ద్వారా శారీరక ఆరోగ్యం పెంపొందించుకోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరిన పండు దొర,S I.
👉మానవ శరీరంలోని అన్ని భాగాలు మెదడు నియంత్రణ తోనే పనిచేస్తాయని, ఐతే కొన్ని,కొన్ని సార్లు మెదడు నియంత్రణ చేసినప్పటికీ శరీరంలోని బాగాలు స్పందించని స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా శరీరభాగాలను ఆరోగ్యంగా, పూర్తిగా వినియోగించుకునే క్రమంలో మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపధ యోగా అని! యోగా ” యుజ్ “అనే సంస్కృత పదం నుండి తీసుకోవడం జరిగిందని, దాదాపుగా 2500 క్రి.పూ, నుండి యోగ అనేది ఉన్నప్పటికీ సింధు,సరస్వతి లోయల్లో నివసించే ప్రజలు యోగా కు కల్పించిన ప్రాదాన్యత మూలంగా నేటికీ కూడా చెక్కుచెదర కుండా మనకు యోగ అందుబాటులో ఉందని, ఐతే శరీరంలో గల ప్రతి బాగానికి ఒక ప్రత్యెక అభ్యాసం కలిగి షుమారు 70 రకాల ఆసనాలు అందుబాటులో నేడు మనకు ఉన్నాయని, ఐతే పెరుగుతున్న కార్యకలాపాలు, తగ్గుతున్న సమయం కారణంగా యోగ అనే విద్య పూర్తి స్థాయిలో అభ్యసించడం అందరికీ సాధ్యం కాని విషయమని, ఐతే నేడు ప్రధానంగా సమాజంలో రెండు సమస్యలు ఉన్నాయని అవి ఉబకాయం,దృష్టి లోపాలు అనేవి సాదారంగా మనకు కనిపిస్తున్నాయి, పై రెండు సాదారణ సమస్యలతో పాటు ప్రత్యేక సమస్యలు కలిగిన వారు వాటికి చెందిన అభ్యాసం చేయడం మూలంగా ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించవచ్చు.