TEJA NEWS TV
వరదయ్యపాలెం. తిరుపతి జిల్లా
న్యాయమైన సమస్యల సాధనకై సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు యూటియఫ్ వరదయ్యపాళెం మండల శాఖ సంఘీభావం తెలిపారు.అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న వారికి మద్దత్తుగా ఆర్థిక సాయం చేయాలని,అందుకు సహకరించాలని ఇచ్చిన పిలుపుకు స్పందించి ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు 33000 రూపాయలను ఇవ్వగా, యంటీఎస్ ఉపాధ్యాయులు కూడా వారివంతు సాయంగా 3000 రూపాయలను ఇవ్వడం జరిగింది.ఇలా వచ్చిన మొత్తం 36000 రూపాయలను,వరదయ్యపాలెం మండల సమగ్ర శిక్షణ ఉద్యోగులకు యుటియఫ్ మండల శాఖ అందించింది.పిలుపునిచ్చిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులకు వరదయ్యపాలెం మండల యుటియఫ్ తరపున అధ్యక్షులు శశికుమార్,ప్రధాన కార్యదర్శి
యన్నం సురేష్ భగవాన్ ధన్యవాదములు తెలిపారు.
యూటియఫ్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ ఉద్యోగులకు ఆర్ధిక సాయం
RELATED ARTICLES