నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయం నందు శుక్రవారం నాడు నందిగామ పట్టణ 14వ వార్డుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు యలమంచిలి కనకరత్నమ్మ (90) ను 13 మరియు 14 వార్డులకు చెందిన ఎన్డీఏ కూటమినేతలతో కలిసి శాలువాతో సత్కరించిన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 90 ఏళ్ల వయసులో మానవసేవయే మాధవసేవ అంటూ ఇటీవల అకాల వర్షాలు వరదల వలన ముంపుకు గురైన వరద బాధితుల సహాయార్థం నిత్యవసర సరుకులు మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు కనక రత్నమ్మ గారు వారికి వచ్చే నెలవారి పెన్షన్ 50 వేల రూపాయలలో 30 వేల రూపాయలు విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శప్రాయాన్నీమయ్యారు. కనకరత్నమ్మ గారిని ఆదర్శప్రాయంగా తీసుకుని ఇటీవల సంభవించిన ముంపునకు చాలామంది ఎన్డీఏ కూటమి నేతలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకున్నారు. ఇంత పెద్ద వయసులో కూడా పరులకు సహాయ పడాలని ఆమెకు ఉన్న తపన నిజంగా అభినందనీయం కనకరత్నమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
యలమంచిలి కనకరత్నమ్మ గారు అందరికీ ఆదర్శనీయం
RELATED ARTICLES