కీసర గ్రామంలో గత రాత్రి తెలుగుదేశం పార్టీ యువనేత యర్రగొర్ల విజయ్ పై పహారా కాసి వైసిపి రౌడీ మూకలు దాడి చేయడంపై శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య తీవ్రంగా మండిపడ్డారు. కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో కలుసుకొని గురువారం నాడు పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రమంతటా వైసిపి పార్టీని రాష్ట్ర ప్రజానీకం మట్టుపెట్టిన వైసిపి రౌడీ మూకలకు ఇంకా బుద్ధి రాలేదని ఇటువంటి కలుపు మొక్కలు అన్నింటినీ ఏరి పారేస్తామని అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సూచన చేశారు. విజయ్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండమని, గ్రామమంతటా పటిష్టమైన పికెట్ ను నిర్వహించమని పోలీసు శాఖ అధికారులకు తెలియజేశారు.
యర్రగొర్ల విజయ్ కుటుంబ సభ్యులకు శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పరామర్శ
RELATED ARTICLES