Sunday, March 23, 2025

మౌలానా అబుల్ కలాం ఆదర్శాలకు అనుగుణంగా విద్యాప్రమాణాలు అమలు చేయాలి

డోన్ పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ అధ్యక్షతన నేడు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి  మరియు  జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలాన అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించినట్లు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని మౌలానా అబుల్ కలాం ఆజాద్  విద్యాశాఖ మంత్రిగా పనిచేసి   తన జీవితకాలంలో విద్యారంగానికి చేసిన కృషిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు . వారు విద్యా రంగములో చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, ఆజాద్ గ్రామీణ పేదలు మరియు బాలికలకు విద్య, వయోజన అక్షరాస్యత, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత విద్య తప్పనిసరి చేశారు. సార్వత్రిక ప్రాథమిక విద్య , మాధ్యమిక విద్య , వృత్తిపరమైన శిక్షణ తోసహా వివిధ రంగాలపై అబుల్ కలాం ఆజాద్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసి వారి జీవితాలను మార్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వెంకట రమణ, వెంకట లక్ష్మీ,  రాధ, లక్ష్మీ కాంత రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుభాన్, ఆదినారాయణ,భారతి, అల్లిపీరా, మద్దిలేటి, సుబ్బరాయుడు, సురేష్, శ్రీనివాసులు, శివన్న, జయసుబ్బరాయుడు, లక్ష్మీ ప్రభావతి, ప్రసాద్ రావు, ముని రాజు, మహేష్, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular