భారతదేశ తొలి విద్యాశాఖమంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు నేటి తరానికి ఎంతో ఆదర్శం అని రెయిన్బో పాఠశాల కరెస్పాండంట్ చిట్టిబాబు అన్నారు. సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అటు తరువాత ఎఫ్ఏ2 పరీక్షల ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎలియాజర్ పల్లిపట్టు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్యా శాఖ మంత్రిగా తను దేశానికి చేసిన కృషిని విద్యార్థులకు గుర్తుచేసారు.ఈ కార్యక్రమం నందు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇతర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేటి తరానికి ఆదర్శం – రెయిన్బో పాఠశాల కరెస్పాండంట్ చిట్టి బాబు
RELATED ARTICLES