మొండ్రాయి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్(రెవిన్యూ) సంధ్యా రాణి ని కలిసి గ్రామంలో 1200 సంవత్సారాల క్రితం ఉన్న శివాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో కమిటీ సభ్యులను కబ్జాదారుడు వీరగోని రమేశ్ దంపతులు, తాల్లపెల్లి యశోద లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అదనపు కలెక్టర్ కి తమ అవేదన తెలిపారు.త్వరగా శివాలయ భూమిని కబ్జాదారుల నుండి రక్షించి గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన శివాలయ నిర్మానం జరిగేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని కొరారు.
అదనపు కలెక్టర్ సంధ్య రాణి మాట్లాడుతూ త్వరలో మొండ్రాయి గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని గుడి నిర్మాణానికి చేపట్టవలసిన చర్యల గురించి నిర్ణయం, కబ్జాదారులపై కఠీన చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ చెవ్వ మొగిలి,ఉపాధ్యక్షులు కడుదురి సంపత్,పరికి యాకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కక్కెర్ల వీరస్వామి,మడత కేశవులు,ప్రధాన కార్యదర్శి పెండ్లి పురుషోత్తం రెడ్డి, కార్యదర్శి చెవ్వ బాలకృష్ణ,కోశాధికారి పెండ్లి రమేశ్, సహాయ కోశాధికారి కొనకటి కమలాకర్,ప్రచార కార్యదర్శిలు వేల్పుల కుమారస్వామి,పొన్నాల హరీష్,గూడ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొండ్రాయి శివాలయ భూమి కబ్జా వెనుక ఎవరి హస్తం ?
RELATED ARTICLES