వరదయ్యపాలెం 10 ఫిబ్రవరి 2025 తేజ న్యూస్ టీవీ
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం అక్సింపాలెంకు చెందిన బాడీ బిల్డర్ వెట్టి శివాజీ రాష్ట్రీయ దేహదారుడ్య పోటీల్లో సత్తా చాటారు. శ్రీకాకుళం నగరంలోని పీఎస్ఎన్ఎం పాఠశాలలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోషియేషన్ అసోషియేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయదేహదారుడ్య పోటీల్లో వెట్టి శివాజీ పాల్గొన్నారు. ఈ పోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 210 మంది బాడీ బిల్డర్ లు పాల్గోనగా, 85 కేజీ విభాగంలో బంగారు పతాకంతో పాటుగా, మిస్టర్ ఆంధ్రా టైటిల్ విన్నర్ గా నిలిచిన వెట్టి శివాజీ మరో మారు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మిస్టర్ యూనివర్స్ వంటి పలు గొప్ప పతాకాలను కైవసం చేసుకున్న శివాజీ, రాష్ట్ర స్థాయిలో 33వ సారి మిస్టర్ ఆంధ్రా టైటిల్ ను కైవసం చేసుకోవడం ప్రశంసనీయం.
మిస్టర్ ఆంధ్రా కు అభినందనల వెల్లువ
రాష్ట్రీయ దేహదారుడ్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి బంగారు పతాకంను సాధించడమే కాక, “మిస్టర్ ఆంధ్రా ” టైటిల్ విన్నర్ గా నిలిచిన వెట్టి శివాజీ కి పట్టణ పుర ప్రజలు, స్నేహితులు, పలువురు పెద్ధలు , అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తో అభినందించారు.మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్రీయ స్థాయిలో నిలిచిన వెట్టి శివాజీ నేటి యువతారానికి స్ఫూర్తి దాయకమని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పట్టుదల, కఠోర దీక్ష, నిరంతర కృషి శివాజీ విజయానికి తొలిమెట్టుగా నిలిచిందని, ఇలాగే మరెన్నో విజయాలతో ముందుకు సాగాలని , మండల ప్రజలు , అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మెరిసిన మిస్టర్ ఆంధ్రా…రాష్ట్రీయ దేహదారుడ్య పోటీల్లో బంగారు పతాకం కైవసం
RELATED ARTICLES