Monday, January 20, 2025

మెదక్ జిల్లా చేగుంటలో కుంటలు కబ్జా

Teja news tv

చేగుంటలో కుంటలను నమిలి మింగిన
ఘనులు అధికారం 
అడ్డుపెట్టుకొని ఆక్రమణ
ఒత్తిళ్లతో అధికారులు సైలెంట్
కుంటల కల సెయిక ప్రాంతమే నేడు పిలవబడుతున్న చేగుంట. గతంలో ఈ ప్రాంతాన్ని ‘చేకుంటగా పిలిచేవారు. వాడుకంలో చేగుంటగా మారిపో  యింది. చేగుంటలో కుమ్మరికుంట, మామిడి కుంట, సింగారికుంట, కాకుల కుంట, ఉల్లెన్ కుంట, గౌకుంట అనే ఆరు కుంటలు
ఉన్నాయి. ఈ కుంటలు వర్షం పడి
నప్పుడు నిండితే వీటికింద గతం
లో పంటలు పండించేవారు. గ్రా
మం మండలంగా మారిపోవడం,
జనాభా పెరిగిపోవడంతో ఆవార
సాలు పెరిగిపోయాయి. అంతేగా కుండ
డా జాతీయ రహదారి పై ఉండడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. అయితే ఆరు కుంటల్లో ప్రస్తుతం రెండు కుంటలను అక్రమా గా కబ్జా చేశారు. జాతీయ రహదారి 44కు అనుకుని ఉన్న కుమ్మరికుంట, సింగారికుం టలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
గుట్టు చప్పుడు కాకుండా కబ్జా .
కుమ్మరికుంటలో వెలసిన కట్టడాలు
కబ్జా ల కారణంగా నీటమునిగిన ఎస్సీ కాలనీ
విస్తీర్ణం 6.28 ఎకరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 3.17 ఎకరాలు శిఖం భూమి ఉంది. అయితే ఈ కుంట లో  గత  హయాంలో కొంతమంది కబ్జా చేసినట్లు
ఆరోపణలు ఉన్నాయి. తాను కబ్జా
చేసి స్థలానికి దర్జాగా కంచె కూడా వేసుకు న్నారు. అలాగే ఇదే కుంటలో మరో వ్యక్తి ఏకంగా 400 గజాల వరకు కబ్జా చేసి భవ నాన్ని నిర్మించాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ చిన్న గుడిని ఏర్పాటు చేశాడు. కుమ్మరికుంటలో కబ్జా జరిగిన విష యాన్ని పలువురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో భవనం నిర్మించిన వ్యక్తికి గతంలో 2020 లో నోటీసులు జారీ చేశారు.  అయితే అప్పటి అధికార పార్టీకి చెందిన నేతలే కబ్జా చేయడంతో
ఒత్తిడి వల్ల ఎలాంటి చర్యలు తీసుకో లేదు. వీరు కబ్జా చేసిన స్థలం ప్రస్తుతం కోట్ల లో పలుకుతుంది. అలాగే సర్వే నంబర్ 314లో ఉన్న సింగారికుంట విస్తీర్ణం 233 ఎక రాలు ఉంది చుట్టుపక్కల ఉన్న కొంతమంది 100 గజాల .  స్థ లం ప్రభుత్వం ఇవ్వగా ఇదే అదనుగా భావిం చిన ఆతను మరో 300 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కూడా
పలు వురు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, ఇరిగే షన్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం, కుమ్మరికుంట, సింగారికుంట కబ్జా లకు గురికావడంతో వర్షాకాలంలో ఈ కుంటలు నిండితే నీరంతా తమ ఇండ్లు ముందు నిండిపోతుందని చేగుంట ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. వరద కాల నీని ముంచుతుందని, దీంతో పాములు, తేళ్లతో సావాసం చేయాల్సి వస్తోందని ఆవే దన వ్యక్తం చేశారు.
కచ్చితంగా చర్యలు తీసుకుంటాం..
చేగుంటలోని జాతీయ రహదారికి ఆను
కొని సర్వే నంబర్ 81లో ఉన్న కుమ్మరికుంట
కుమ్మరికుంట, సింగారికుంటపై సర్వే చేసి కబ్జా చేసినట్టుగా నిర్గారణ అయితే తప్ప కుండా చర్యలు తీసుకుంటాం సి నారాయణ చేగుంట తాసిల్దార్  . తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, పూర్తి సమాచారం తీసుకొని కుంటలు కబ్జా కు గురైతే నోటీసులు ఇస్తాం. అని చెప్పారు
సి నారాయణ, తహసీల్దార్, చేగుంట

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular