*ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ జగ్గయ్యపేటలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న లీలా కృష్ణా మెడికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ మరియు నెహ్రు చౌక్ దగ్గర ఉన్న
వాసవి మెడికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ మెడికల్ షాపులో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగినది.
ఈ తనిఖీలు నిర్వహించగా షాపు యజమానులు కొనుగోలు బిల్స్ చూపడంలో విఫలమయ్యారు మరియు అమ్మకము బిల్లులు చూపటంలో విఫలమయ్యారు.
అని ఈ విషయం మీద ట్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు పై అధికారులకి.తెలియజేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు.
ఇప్పుడు డయోరియా ఫీవర్స్ విరోచనాలకు సంబంధించిన కేసులు జగ్గయ్యపేటలో అధికంగా వస్తున్నాయి. కావున వాటికి సంబంధించిన మెడిసిన్స్ పెట్టుకోవాల్సిందిగా మరియు అనుమతులు లేని మందులను విక్రయించరాదని నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.