TEJA NEWS TV :
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
ఏర్పాట్లను పరిశీలించిన పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఈనెల 28 శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శిస్తారని, పార్క్‌లో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనపై టీఎస్ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఈనెల 28 శుక్రవారం రోజున సీఎం రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించనున్న నేపథ్యంలో గురువారం గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును గురువారం అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు పరిశ్రమలు, పార్క్‌కు కేటాయించిన భూముల వివరాలతో కూడిన మ్యాప్‌తో పాటు హెలిప్యాడ్‌ను పరిశీలించారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టెక్స్‌టైల్ పార్క్ సంఘర్షణకు శుక్రవారం వస్తున్న సందర్భంగా టీఎస్ఐఐసీ అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,సంగెం ఎంపిపి కందకట్ల కళావతి నరహరి, గీసుగొండ ఎంపిపి బీమగానీ సౌజన్య మెట్టుపల్లి రమేష్, చోల్లేటి మాధవరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.