సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్,బిఆర్ఎస్ నాయకులు కొల్కనూరి ఎల్లస్వామి తల్లి రామక్క కొద్దిరోజుల క్రితం మృతిచెందగా ఆదివారం రోజున పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రామక్క కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అలాగే సంగెం మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాట్రపల్లి గ్రామా వాస్తవ్యులు చింతిరెడ్డి బుచ్చిరెడ్డి తల్లి శామలమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
