*వైయస్సార్ సేవలు చిరస్మరణీయం*
*మూలమలలో వైయస్సార్ 15వ వర్ధంతి వేడుకలు*
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దివంగత ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఆయన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంపీటీసీ లక్ష్మన్న,గ్రామ యూత్ ప్రెసిడెంట్ ఏ.సుధాకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దాల వెంకటన్న, ఉషన్న కురువ రాజు,కాసిం,ఆనంద్ శేఖర్,కావలి సూరి,ముష్టి శ్రీనివాసులు,బుచ్చన్న,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
మూలమలలో వైయస్సార్ 15వ వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES