రాజుగారు ర్యాంపు జరభద్రం.
ఇచ్చట పాత్రికేయులకు ప్రవేశం లేదు.
తెలంగాణలో అతిపెద్ద ఫ్రాడ్.
రాంపురం, సుర వీడు, రామచంద్రాపురం, ఒంటి చింతగూడెం ఇసుక క్వారీలు.
అడుగుపెట్టామా ఆయుధాలు కలిగి ఉన్న తాగుబోతు కమిటీ సభ్యులకు బలి కావాల్సిందే.
అక్రమాలకు అడ్డాగా మారిన ఈ రేస్ లోనేనేం తక్కువ కాదు ఇసుక దందాలో 10 కోట్ల వాటాతో ఉన్నాను అని ముందు వరుసలో చర్ల మాజీ జడ్పిటిసి.
అక్క పేరు చెప్తే చాలు వెన్నులో వణుకు పుట్టాల్సిందేనట.
నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ వెలుగులోకి వంటి చింతగూడెoఇసుక క్వారీ ఉపాధ్యాయుడు.
ఎవరికివారు జోరుగా దోపిడి కి పాల్పడుతున్న వైనం.
ఎన్ని వార్తలు రాసిన తగ్గని వారి జోరు.
టిఎస్ఎండిసి అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుంది అని షికారులు పుకార్లు.
ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాలలో ఇసుక దందా భారీగా జరుగుతుంది.
టిఎస్ఎండిసి పర్యవేక్షణ లోపంతో ముఖ్యంగా ఒంటి చింతగూడెం, రామచంద్రపురం సురవీడు, రాంపురం ఇసుక క్వారీలు, లారీ డ్రైవర్ల వద్ద ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు దక్కాల్సిన లబ్ధిని ఇసుక రాబందులు అమాయక గిరిజనులకు తులమో ఫలము ఆశ చూపించి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ ఇచ్చిన తులం పైకానికే గిరిజనులు కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందపడుతూ, ఇసుక క్వారీ వాళ్ళ పేరు మీదనే ఉన్నదన్న సంగతి మర్చిపోయి , సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అని 10000 తీసుకొని మురిసిపోతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆంధ్ర కాంట్రాక్టర్లు వారి అజ్ఞానం మీద కాలు వేసి పాతాళానికి తొక్కేస్తున్నారు. ఇవేమీ తెలియని గిరిజన సొసైటీ సభ్యులు పీసా చట్టం అమలు కోసం వచ్చిన విలేకరులపై మూర్ఖంగా విరుచక పడుతూ పిసా చట్టాన్ని పటిష్టంగా నిర్మించే విలేకరి పై దాడులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఒంటి చింతగూడెం ఇసుక క్వారీ లో జరిగే అక్రమాలు అంతా ఇంతా కాదు, డిడి తీసిన దానికంటే ఎనిమిది వేలు అదనంగా వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు.
ఈ విషయంలో విలేకరులు ప్రశ్నిస్తే చుట్టుపక్క ఉన్న వారితో సీతక్క ఆయనకు బాగా దగ్గర అని చెప్పిస్తూ వచ్చిన విలేకరులను భయపెట్టించే యత్నానికి పాల్పడుతున్నారు. వారి అక్రమ వ్యాపారాలకు సీతక్క పేరు వాడడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి దొంగ వ్యాపారం చేస్తూ నాయకుల పేర్లు వాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయుడు ముసుగులో చేస్తున్న ఈ అక్రమం పట్ల టిఎస్ఎండిసి అధికారులు సైతం నోరు మెదపకపోవడం విశేషం.
ఇదిలా ఉండగా సురవీడు ఇసుక క్వారీలో ఇంకా దారుణం.
డబ్బుల కోసమే క్వారీని నడుపుతున్నాము అన్నట్టుగా వారి చర్యలు ముక్కు మీద వేలేసుకునేలా చేస్తున్నాయి. ఇసుక లారీ పొరపాటున బురదలో కోరుకపోతే దాన్ని నెట్టడానికి సుమారు 200 నుండి 500 పైకం చెల్లించాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. జెసిబికి 500 రూపాయలు చెల్లిస్తేనే ప్రభుత్వా ఆదేశాల మేరకు తీసిన డిడి లో ఉన్న 32 నుంచి 34 టన్నులు లోడ్ చేస్తున్నారని లేని పక్షంలో డిడిలో ఉన్న దానికంటే ఒక టన్ను తక్కువ పోస్తున్నారు అని తెలిపారు. అది కూడా ఫోన్ పే గూగుల్ పే చేస్తే లోడింగ్ నిలిపి వెస్తున్నట్టు డ్రైవర్లు వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ర్యాంపులు అన్నిటికీ సూత్రధారి చర్ల మండలంలో మాజీ జడ్పిటిసి, అవ్వడం ఒక మారు ఆలోచించేలా చేస్తోంది, సురవీడు ఇసుక క్వారీ, సుబ్బంపేట లో ఉన్న రెండు ఇసుక క్వారీలకు పెద్ద పార్ట్నర్ చర్ల మాజీ జడ్పిటిసి అని తెలుస్తోంది. ఇక్కడే కాస్త ఆలోచించేలా అనిపిస్తున్న ఒక సంఘటన వెలువడింది.. ఒక ఇసుక క్వారీని నడిపించడానికి కనీసం మూడు నుండి ఐదు కోట్ల రూపాయలు అవుతుంది. అటువంటిది ఐదు,ఆరు రాంపులు నడిపించే అంత డబ్బులు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయని సందేహం ప్రజలలో రగులుతున్న అగ్నిగోలంలా ఎగిసిపడుతున్నట్టు మండలంలో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.ఒక జడ్పిటిసి కి అంతలా డబ్బులు వారి ఐదేళ్ల కాల పరిమితులో సంపాదించవచ్చా?.
అలా అయితే వాజేడు వెంకటాపురం మండలం జడ్పిటిసి పాయం రమణ ఒక సాధారణ జీవితం ఎలా గడుపుతుంది. ఈమెకు సైతం ఐదు రాంపులు పెట్టే అంత డబ్బులు ఎందుకు లేవు?
తేడా ఎక్కడ జరుగుతుంది.? అనే అనుమానాలు ప్రజల్లో మదిలో నుండి ఉబికి వస్తున్నాయని ప్రధమ ఆరోపణ.
ఇటువంటి వారికి ప్రజలు మరల ఓటేసి గెలిపిస్తారా.
పార్టీ పేరు చెప్పుకొని పరిమితులు దాటుతుంది అని వస్తున్న ఆరోపణలకు, ఒక సాధారణ జడ్పిటిసి అయ్యుండి 10 కోట్లు రూపాయల పెద్ద షేర్ ను కలిగి ఉన్న విధానం పట్ల సిబిఐ ఎంక్వయిరీ చేసి ఆమె లోగొట్టును ప్రజలకు తెలపాలని కొందరు కోరితే, ఆమె నీతి గానే సంపాదిస్తే ఆ చిట్కా ఏంటో మిగతా జడ్పిటిసిలకు కూడా చెప్తే వాళ్లు కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వాజేడు మండలంలో తెలంగాణలో జరగనంత దోపిడీ ఒక ఇసుక క్వారీలో జరిగిందంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ లో పెద్ద దోపిడి అంటే గుర్తొచ్చేది వాజేడు మండలం అయ్యవారిపేట రాంపురం ఇసుక క్వారీలు. పాత్రికేయులు సైతం లోనికి పోవడానికి ప్రవేశం లేదు అంటే వారి దందా ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ ఆదమరిసి పాత్రికేయుడు ఇసుక క్వారీ దగ్గరకు వెళ్తే ఇది రాజు గారి క్వారీ ఏమనుకుంటున్నావు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న తాగుబోతు కమిటీ సభ్యులతో మెడలు పట్టుకొని బయటికి నెట్టేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటూ సదరు పాత్రికేయులు కూడా స్పష్టంగా వివరించారు. టిఎస్ఎండిసి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మిషనరీ వాడకుండా గిరిజన కూలీలను ఉపాధి కల్పిస్తూ ఇసుక బయటకు తీయాలి , ఇటువంటి వాటి గురించి మాట్లాడితే కాస్త హాస్యాస్పదంగా ఉన్న ఆ రూల్స్ మర్చిపోయి చాలా కాలం అవుతుంది అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు. అసలు టిఎస్ఎండిసి అధికారులు ఈ విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
మూడు తాడి చెట్ల లోతు తీస్తున్న రాంపురం ఇసుక క్వారీ వైపు అధికారులు కన్నెత్తైనా ఎందుకు చూడడం లేదు, అంటూపలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాకుండా విలేకరులు ఎవరైనా అడిగితే టిఎస్ఎండిసి అధికారులకు ముందే పైకం చెల్లించాము ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రౌడీ ముఠా తో పాత్రికేయుల మీదకు గొడవకు దిగడం జరుగుతుంది. అని బలంగా వినిపిస్తున్న విషయం. ఈ విషయాల పట్ల టిఎస్ఎండిసి అధికారులు విఫలమైన కారణంగా, జిల్లా కలెక్టర్ స్పందించి
సూర వీడు, ఒంటిచింతగూడెం, ధర్మారం రాంపురం, రామచంద్రాపురం, ఇసుక క్వారీలపై, తగిన చర్యలు తీసుకొని, లారీ డ్రైవర్ల బతుకులలోను గిరిజనుల బతుకులు వెలుగులు నింపాలని వారు కోరుకుంటున్నారు.