TEJA NEWS TV
వెంకటాపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు 10000 రూపాయలు విలువగల ఫర్నిచర్ బహుకరించారు. తుమ్మల వెంకట్ రెడ్డి చేతుల మీదగా , కళాశాల అకాడమిక్ ఇంచార్జ్ డాక్టర్ అమ్మిన శ్రీనివాసరావుకు అందజేశారు. వారి బహుకరణ పై కళాశాల బృందం కృతజ్ఞతలు తెలిపారు, ప్రజల కోసమే కాదు పిల్లల భవిష్యత్తు కోసం కూడా సిపిఎం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గ్యానం వాసు, మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, మండల నాయకులు కట్ల నరసింహ చారి, మాణిక్యం, వీర వేణి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ములుగు జిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ బహూకరణ
RELATED ARTICLES