భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ,
28-1-2025
అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన పథకాల అమలుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 2025 జనవరి 28న (మంగళవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల ప్రభావం ప్రజల మీద పాజిటివ్‌గా ఉన్నదని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరియు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజా సేవే తమ ధ్యేయమని, ప్రజల అవసరాలకు తగిన విధంగా పార్టీ పని చేస్తుందని నాయకులు తెలిపారు.