వరదయ్యపాలెం మండలం, వరదయ్యపాలెం మేజర్ పంచాయతీ బీసీ కాలనీకి చెందిన కే రామలింగం(69)తన వృద్దాప్య పింఛను కొరకై పడరాని పాట్లు పడుతూ ప్రెస్ క్లబ్ దృష్టికి వచ్చారు.ఈ విషయంపై స్థానిక ఈఓ బసిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొఱకు కృషి చేయాలని ఆ పెద్దాయన తరపున వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి గుత్తి త్యాగరాజు విజ్ఞప్తి చేశారు.పెద్దాయనను పంచాయతీ కార్యాలయంకు పిలిపించి,ఈఓ బసిరెడ్డి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.వయో వృద్ధుని భార్య జూలై నెలలో పరమపదించనదని,ఆమె మరణ ధ్రువ పత్రం పొందిన తర్వాత తనకు పింఛను కోసం కార్యాలయం కోసం వచ్చానని, వాలంటీర్ ను సంప్రదించానని ఆయన ఈఓ కు తెలిపారు.ఈఓ డిఏ ద్వారా అతని ఆధార్ నంబర్ ను పరిశీలించగా అతనికి పింఛను ఇప్పించడానికి అవకాశం ఉన్నదని తెలుసుకుని,వాలంటీర్ ను పిలిపించి,పింఛను దరఖాస్తు చేయడానికి కావలసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వీలైనంత త్వరగా సిద్ధం చేసి,ఆన్లైన్ లో పెట్టాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టినప్పటికి ఇలాంటి వయో వృద్ధులను గుర్తించి,వారికి దృవీకరణ పత్రాలు ఇప్పించక పోవడం,వారి పనితీరుకు ఇది ఒక నిదర్శనం.వైఎస్ఆర్ టియూసి మండల చైర్మన్ వేనాటి జగదీశ్ రెడ్డి కే రామలింగం(69)ఇంటికి వెళ్లి,పరిస్థితి తెలుసుకుని,ధైర్యం చెప్పి,తప్పకుండ పింఛను వస్తుందని భరోసా కల్పించారు. ఇదే రీతిలో పృథ్వి గురు అనే మరొకతనికి బియ్యపు కార్డు నందు తన పేరును ఎక్కించుకోడానికి సరైన సూచనలు ఇవ్వలేకపోయారు. ఇదిలా ఉండగా మరొక సచివాలయం పాండూరులో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఓ పాపకు స్త్రీ లింగం /పులింగం / కాకుండా మరొక లింగ పేరుతో ఆధార్ కొఱకు నమోదు చేయడంతో,ఆధార్ అప్డేట్ ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వచ్చినది.మరొకరికి కుల ధ్రువీకరణ పత్రంలో మార్పు జరగడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తింది.జాయింట్ కలెక్టర్ స్థాయిలో గానీ,అది సరి చేయడానికి వీలు కాదు అని,సచివాలయ సిబ్బంది చెప్పడంతో,వయో వృద్దుడైన అతను ఏమి చేయలేక,దిక్కు తోచక కూర్చున్నారు.రెవిన్యూ విభాగంలో కూడా కొన్ని పరిష్కారం కాని ఇబ్బందులతో,కొందరు సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పధకాలు చేపట్టి,ప్రజలను వాటిని చేరువ చేయడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది.ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించింది.రాజకీయ అండ వున్న వారు వాలంటీర్స్ గా నియమితులయ్యారు.అంతటి ప్రాధాన్యత కల్గిన సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి ఆశయాలను ప్రజలకు చేరువ చేయడంలో ఇంకాస్త అంకిత భావం ప్రదర్శించవలసిన అవసరము ఎంతైనా ఉంది.
ముఖ్యమంత్రి ఆశయ సాధనకు సచివాలయ సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేయాలి
RELATED ARTICLES