దేవాలయాలు ఎప్పుడు భక్తులతో కలకలలాడాలని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలం నుండి కూడా అనేక దేవాలయాలను నిర్మించి ముఖ్యంగా వందలాది ఎకరాలు పొలాలు దానం ఇచ్చి,ముక్యాల,వేదాద్రి గ్రామంలో వారి స్వయంపాలనలోని దేవాలయాలు నడుస్తున్నాయి.
అట్టి దేవాలయాల్లో కూడా దేవాలయ సిబ్బంది వారు ఆడింది ఆట పాడింది పాట లాగా ఉంది
ఇటీవల మహిళా ఈవో వచ్చింది అని అనగానే కొంతమంది మహిళలు దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహిస్తారు. దేవాలయ పరిపాలన బాగుంటుందని ఆశించారు.
కానీ ఆశలు అడియాసలేనివి ఎ క్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నాయి. ఇక్కడ ఏ, ఏ సిబ్బంది పని చేస్తున్నారు?ఎవరు చేస్తున్నారు? ఏ సమయానికి వస్తారు? అనేది కూడా లేదు.
వేల రూపాయలు జీతాలు తీసుకుంటూ స్వామివారి కైంకర్యాలకు డుమ్ము కొడుతున్నారు.
గతంలో ఈ దేవాలయం నిత్యం పత్రికలకు ఎక్కుతూ సోషల్ మీడియాలో ప్రచారం అయ్యేది మరలా పునరావృతం అవుతుందేమో అని భక్తులు వాపోతున్నారు
ఎర్రటి ఎండలో దేవాలయంలో కాళ్లు కాలుతున్నందున భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయినది
ఆ దిశగా అధికారులు సిబ్బంది చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం
రాజా వారి కుటుంబీకులు వేదాద్రి, ముక్యాల దేవాలయాలలో పని చేస్తున్న ఈవో మరియు సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ధార్మిక సంస్థల ప్రతినిధులు ధర్మ ప్రచారకులు భక్తులు కోరుతున్నారు
ముక్యాల శ్రీ భవాని ముక్తేశ్వర స్వామి వారి ఆలయం నేటి పరిస్థితి ఇది
RELATED ARTICLES