నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది. నియోజకవర్గంలోని అర్హులైన వృద్ధులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వారితో కలిసి భోజనం చేసి, స్వయంగా పింఛన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నా తల్లిదండ్రులను ఇప్పుడు నేరుగా చూడలేకపోతున్నాను. కానీ మీ అందరిలో వారిని చూసుకుంటున్నాను. అందుకే ఈరోజు భోజనం పెట్టి, చేతులారా పింఛన్ ఇవ్వడం ఎంతో సంతృప్తికరం,” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఇటువంటి కార్యక్రమం ఇప్పటిది కాదు… తండ్రి భూమా నాగిరెడ్డి హయాంనుంచే ఈ పద్ధతిని కొనసాగిస్తున్నామన్నారు. “మా నాన్నగారు కూడా ప్రతి నెల ఇలా భోజనం పెట్టి పింఛన్ ఇచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని నేను కొనసాగిస్తున్నాను,” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పింఛన్ లాభదారులు పాల్గొన్నారు. వారికి ఎమ్మెల్యే అందించిన ఆత్మీయత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీ అందరిలో మా తల్లిదండ్రులను చూస్తున్నా –భావోద్వేగంతో అఖిలప్రియ
RELATED ARTICLES



