బుచ్చి రెడ్డి పాలెం జూలై 15(తేజ న్యూస్ టీవీ )
బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని మినగల్లు ఇసుక రీచ్ ను కోవూరు ఎంఎల్ఏ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గతంలో రీచ్ కు సంబంధించి డిడి మైన్స్ నిర్వహిస్తుండగా.. వారికి కేటాయించిన ఇసుక స్టాక్ యార్డ్ లో స్టాక్ పూర్తవడంతో.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రీచ్ ను మంగళవారం డిడి మైన్స్ యాజమాన్యం పర్యవేక్షణలో ఎమ్మార్వో, ఆర్ ఐ, అధికారులు పరిశీలించారు. రీచ్ వద్ద ప్రత్యేక సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. మినగల్లు, జొన్నవాడ రీచుల నుంచి ఇసుక తరలించుటకు ఎలాంటి ట్రాక్టర్లు, టిప్పర్లు, జెసిబిలు, ఇతర భారీ వాహనాలకు అనుమతి లేదని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఇసుక అక్రమ తరలింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
మినగల్లు ఇసుక రీచ్ తాత్కాలికంగా మూసివేత
RELATED ARTICLES



