Monday, December 15, 2025

మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్ సహకారంతో చలివేంద్రం ప్రారంభం

హొలగుంధ : ఎండాకాలం సమీపిస్తున్న వేళ  ఎండాకాలంలో విద్యార్థులు ప్రజల, ప్రయాణికుల దాహం తీర్చేందుకు టీబీపీ ఎల్ ఎల్ సి డిసి చైర్మన్  మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆదోని డివిజన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పంచగుండుగా వెంకటేష్ తెలిపారు .స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఉదయం 11 గంటలకు మండల తాసిల్దార్ నిజాముద్దీన్, మాజీ సర్పంచ్ రాజా పంపనగౌడ్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి నీటిని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదు అవుతున్నాయని ఎండలో తిరిగేవారు దప్పికతో డిహైడ్రేషన్కు గురై  అనారోగ్యం బారిన పడకుండా నీరు అందించే   కార్యక్రమాన్ని  చేపట్టడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగపరుచుకోవాలని నీటిని ప్రతి ఒక్కరు వృధా చేయకుండా వినియోగించుకోవాలని కోరారు.  
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిక్కిలినేని శ్రీనివాసరావు, అలేఖ్య విజయ్ కుమార్, జడ్పీ పాఠశాల చైర్మన్ ద్వారకానాథ్ ఆచారి, బిజెపి ఏ ఈ ఎన్ ప్రసాద్, బహుజన  టైమ్స్ దుర్గాప్రసాద్, ప్రతినిత్యం కన్నారావు, దళిత నాయకులు సినిమా మంగన్న, రాళ్లుకొట్టే నాగరాజు, మార్లమడికి లంకెప్ప, రంగప్ప హొన్నూరు కొట్టాల కొల్లప్ప, వరాల రాజా సిద్ధ.K సాయిబేష్.రామచంద్ర. భాస్కర్.నాగేష్.వాల్మీకి యువ నాయకుడు.శీను. సిద్దయ్య స్వామి గిరి చిదానంద.నాగేంద్ర.హెచ్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular