తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని పెద్ధపాండూరులో మించెన్ తుఫాన్ ప్రభావంతో నిర్వీరామంగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులు కారణంగా ఆదివారం ఉదయం విద్యుత్ వైర్లు తెగిపడి గేదె మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.మించెన్ తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు , నిర్వీరామంగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపడి షేక్ మాబుకు చెందిన గేదె మృత్యువాత పడింది.ఎంతో కష్టపడి రూ.70 వేలు వెచ్చించి, గేదెను కొనుగోలు చేశామని, తమకు జీవనాధారం లేకుండా పోయిందని భాదిత మహిళా పాడిరైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భాదిత మహిళా పాడిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామీణవిద్యుత్ లైన్ మ్యాన్ ల నిర్లక్ష్యానికి పశువులు, మృత్యువాత పడటమే కాక, గతంలోనూ వైర్లు తెగి పడి గడ్డివాములు తగలబడ్డాయాని,కొన్నెళ్ళక్రితం మనుషులు మృత్యువాత పడిన ఘటనలు లేకపోలేదని గ్రామస్తుల గగ్గోలు పెడుతున్నారు.
మించెన్ తుఫాన్ ప్రభావం -విద్యుత్ వైర్లు తెగిపడి గేదె మృతి
RELATED ARTICLES