TEJA NEWS TV ALURU:
ఈరోజు హొళగుంద మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామనికి చెందిన విద్యార్థులు గ్రామస్తులు బస్సు సౌకర్యం కల్పించాలని డిప్యూటి తహశీల్దార్ నిజాముద్దీన్ కి వినతిపత్రం అందజేస్తారు. పెద్దాహ్యాట నుండి హళగుంద పాఠశాల,కళాశాలకు విద్యాభ్యాసం కొరకు సుమారు.50 మంది పైగా విద్యార్థులు,కాలినడకన,పోను 8 కిలోమీట రాను 8 కిలోమీటర్లు మొత్తం 16 కిలోమీటర్ల నడిచి రావల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో విద్యార్థినిలు,స్థానిక పాఠశాలలో (పెద్దహ్యట ) 5 వ తరగతి వరకే చదువు చాలస్తున్నారు.పై తరగతులకు హొళగుందకు బస్సు సౌకర్యము లేకపోవడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు, అమ్మాయిలను పొలం పనులకు.తీసుకెళ్తున్నారు. దీంతో విద్యార్థినిలు చదువుకు దూరం అవుతున్నారు..ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బస్సు సౌకర్యం కల్పించి గ్రామణ విద్యార్థుల ఉన్నత చదువుకు సహకరించాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదంత్రులు కోరూతున్నారు.ఈకార్యక్రమంలో మాదసి కురువ సంఘం ఆలూరు తాలూకా ప్రధానకార్యదర్శి మల్లయ్య.మాలమహనాడు జిల్లా కార్యదర్శి వీరభద్ర.బీజేపీ మండల కన్వీనర్ ప్రసాద్.టీడీపి మాజీ కన్వీనర్ వీరన్న గౌడ్,సిఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు, మాదసి కురువ సంఘం మండల అధ్యక్షులు పంపాపతి.చిన్నహ్యట క్రిష్ణ గర్జాప్ప.బిజెపి నాయకులు బసవ.బెనకప్పా. గ్రామస్తులు.విద్యార్థులు పాల్గున్నారు.