తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ముద్దు కృష్ణ 400 మీటర్ హార్దిల్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించారు. ఈనెల 9,10, 11 తేదీలలో తిరుపతిలో జరిగిన 42వ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని ఈ విజయం సాధించారు. అదేవిధంగా 5 కిలోమీటర్ల పరుగు పందెం మరియు హైజంప్, 4×100 మీటర్ లో మూడవ స్థానలలో విచ్చేసి జాతీయస్థాయికి ఎన్నుకోవడం జరిగింది.వచ్చేనెల మహారాష్ట్ర, నాసిక్ లలో జరిగే జాతీయస్థాయి 400 మీటర్ హార్దిల్స్ పరువు పందెంలో ఈయన పాల్గొంటున్నారు. రాష్ట్రస్థాయిలో తిరుపతి జిల్లాను ఛాంపియన్గా నిలబెట్టడంలో ముద్దు కృష్ణ కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు.
మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలబడిన వరదయ్యపాలెం మండలం వ్యాయామ ఉపాద్యాయుడు
RELATED ARTICLES