అమోజ్మడ్లో కగార్ విస్పోటనం.
20వ వార్షికోత్సవాల వేల మావోయిస్టులకు ఎదురు దెబ్బ
అమూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్.
ఇరువురికి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి.
చతిస్గడ్ లో అతి పెద్ద ఎన్కౌంటర్ గా అధికారులు గుర్తింపు.
వరస ఎన్కౌంటర్లతో కుదేల్ అవుతున్న మావోయిస్టులు.
కొరియర్ల సమాచారంతో దూసుకుపోతున్న భద్రత బలగాలు.
ఎన్కౌంటర్లలో అగ్రనేతలు ఉండచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం.
2026 నాటికల్లా మావోయి జానీ లేకుండా చేస్తా o అన్న అమిత్ షా మాటలు నిజం చేయనున్నారా.?
అమూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్లతో దూసుకుపోతున్న బలగాలు.
కాల్పుల మోతతో మరోసారి చత్తీస్ ఘడ్ దండకారణ్యం దద్దరిల్లింది. దండకారణ్యంలో యుద్ధం కొనసాగుతుంది. మావోయిస్టులను ఏరి వేసేందుకు పోలీస్ శాఖకు సంబంధించిన ప్రత్యేక బలగాలు అడవిలోకి చొచ్చుకేళ్తుండగా వారిని నిలువరించేందుకు మావోయిస్టులు ఎదురుకాల్పులతో విరుచుకుపడుతున్నారు. దీంతో దండకారణ్యం అలజడిగా ఉంది. దాడులు, ప్రతి దాడులతో అటు మావోయిస్టులు, ఇటు భద్రత బలగాల మోహరింపుతో దండకారణ్యం వార్ జోన్ గా మారింది. నారాయణపూర్,దంతేవాడ జిల్లాల పరిధిలోని దండకారణ్యంలో ఇప్పుడు మావోలకు,భద్రత బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. చత్తీస్ ఘడ్, నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో.శుక్రవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీగా ప్రాణా నష్టం జరిగింది.36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ దృవీకరించారు. మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బస్తర్ ఐజి సుందర్ రాజ్ ఆదేశాల మేరకు నారాయణపూర్ ఎస్పి ప్రభాత్ కుమార్ తమ సిబ్బందితో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. మావోయిస్టులకు సేఫ్ జోన్ గా పరిగణించబడే అబూజ్మడ్ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
మావోయిస్టుల సేఫ్ జోన్ అబూజ్ మండ్లో ఎన్కౌంటర్.
చత్తీస్ ఘడ్ లో ఎక్కువగా మావోయిస్టులు సంచరించేది అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో అక్కడే ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారం పోలీసులకు అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ ను ముమ్మరం చేశాయి. దంతేవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో భద్రతా బలగాలకు,మావోయిస్టు గెరిల్లాల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు భద్రత బలగాల చేతిలో హతమైనట్లు తెలుస్తుంది.శుక్రవారం సాయంత్రం వరకు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.కాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ పోలీసులు భావిస్తున్నారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు తరసపడినట్లు తెలుస్తుంది. బలగల రాకను పసికట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని. వెంటనే అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురు కాల్పులకు దిగటం జరిగిందని తెలుస్తుంది.
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.
పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఘటన స్థలం నుండి ఏకే 47,ఎస్ ఎల్ ఆర్ తదితర అధునాతన ఆయుధాలతోపాటు పేలుడు పదార్థాలను, మావోయిస్టు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులందరూ సురక్షితంగా ఉన్నారని మావోయిస్టులతో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతుందని. అడపా దడపా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని,భద్రత బలగాలు దూకుడు వ్యూహాలను అనుసరించి మావోయిస్టులపై సర్వసక్తులు వడ్డుతున్నాయని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ తో అప్రమత్తమైన పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి.ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకు 36 మంది మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది.14 మంది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మృతుల సంఖ్య పై ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు.
20వ వార్షికోత్సవాల వేళ మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ
సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాలను జరుపుకోవాలని పలు పత్రికా ప్రకటనలతో పాటు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. వార్షికోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో అబూజ్మడ్ ప్రాంతంలోని నెందూర్, తులతులి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం, కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఘటనా స్థలంలో అధునాతన ఆయుధాలు లభ్యమవుతుండడంతో కమాండర్, డిప్యూటీ కమాండర్ స్థాయి కేడర్ తో పాటు అగ్ర నేతలు కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మావోయిస్టులపై బుల్లెట్ల వర్షం కురిపించిన భద్రత బలగాలు
RELATED ARTICLES