

TEJA NEWS TV
కర్నూల్ జిల్లా ఆలూరు తాలూక్ హొళగుంద మండలనీకే మార్కెట్ యార్డు చైర్మన్ స్థానాన్ని చిన్నహ్యట శేషగిరి గారికే తప్పక కేటాయించాలని సమావేశం నిర్వహించిన దళిత సంఘాల సీనియర్ నాయకులు బసప్ప, హనుమంతు, మరియు వరాల వీరేష్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ స్థాయిలో దళితులు, అట్టడుగు అణగారిన వర్గాలకు బాసటగా నిలిచే చిన్నహ్యట శేషగిరి పీడితుల పక్షాన ప్రజాగోంతుకై ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలు చేశారన్నారు.
ఆలూరు తాలూకా వ్యాప్తంగా నిష్కళంకితుడు, వివాదరహితుడు, అనుభవజ్ఞుడు, సుపరిచితుడు, కార్యదక్షుడు, రైతుబంధు, ప్రజాపక్షపాతిగా ఆలూరు అభివృద్ధికి అహర్నిశలు తపించే రాజకీయ కోవిదుడు రాజకీయ రంగ ప్రవేశం నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీయే తన కుటుంబంగా ఆలూరులో పార్టీ పునర్ వైభవం కోసమే గత 26 సంవత్సరాలుగా పట్టు విడవని విక్రమార్కుడై పాటుపడుతున్న చిన్నహ్యట శేషగిరి నిబద్ధత, సేవలు వెలకట్టలేనివి.
అయితే ఆలూరు నియోజకవర్గం లోని ప్రతి మండల వాసులు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా అవకాశం పొందినప్పటికీ అభివృద్ధికి అందనంత దూరంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనున్న హొళగుంద మండలానికి ప్రతిసారి మొండి చెయ్యేమిగిలిందన్నారు.
కావున ఈసారి తప్పకుండా హొళగుంద మండలానికి తగిన ప్రాధాన్యతనిస్తూ మాజీ ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు, మాజీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిన్నహ్యట శేషగిరి గారికే నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పట్టం కట్టాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ దళిత నాయకులు దేవన్న, రాజు దళిత యువ నాయకులు రాజేష్, అనిల్, నాగేష్ మరియు తదితర దళిత, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని డిమాండ్ చేశారు.