మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో తెదేపా – వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన అనుచరులతో కలిసి తెదేపా నాయకులను కులాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు తెదేపా మంత్రాలయం ఇంచార్జి వర్యులు రాఘవేంద్ర రెడ్డి.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే ఈ విధమైన కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలను మోసం చేసి వనరులను దోచుకున్న వారే, ఇప్పుడు స్వార్థంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
ఘర్షణలో గాయపడిన మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, లక్ష్మన్నల సోదరులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెదేపా నేతలు రామకృష్ణ రెడ్డి, సురేష్ నాయుడు పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాల్వి సిద్దప్ప, భీమా, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
మారని తీరు.. ప్రజలను రెచ్చగొట్టే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి: టీడీపీ నేత రాఘవేంద్ర రెడ్డి విమర్శ
RELATED ARTICLES