TEJANEWSTV TELANGANA
యోగా ఒక ఆధ్యాత్మిక సాధన మరియు యోగా మానసిక శారీరక అభివృద్ధికి దోహద పడుతుంది అని యోగా నిపుణులు చెప్తున్నారు. యోగా ప్రతి రోజు చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా ఉండటం తో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంచుతోందని చెప్తున్నారు ముఖ్యంగా మారుతున్నటువంటి జీవనశైలి లో యోగా ప్రతి మనిషికి అవసరం దీని ద్వారా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు,షుగర్, అజీర్తి మోకాళ్ళ నొప్పులు, వేరికోవేయిన్స్, మైగ్రేన్, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ ఊబకాయ, ఆస్తమ, మానసిక సమస్యలు ఏకాగ్రత లోపం, మానసిక రుగ్మతలు, ఉద్వేగాలను నియంత్రణలో ఉంచడం దీర్ఘకాలిక సమస్యలు సర్వరోగాలు తగ్గించవచ్చని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలని ప్రతిరోజు చేయాలని చెబుతున్నారు మన మండలం ఉన్న యోగా కేంద్రం లో చేరాలని చెప్తున్నారు.
ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు పంపరీ శివరాజు, ఉప్పల అనంత్ కుమార్, చందుపట్ల శ్రీహరి, బింగి పెంటప్ప, వడ్ల భూమయ్య, కుర్ల రాజయ్య, దడిగే నర్సింలు, నగిరి దాకయ్య, శ్యాగ బాబు, సింగం మధు గౌడ్, గాడి పోచమ్మ, క్యాతం శంకర్, తుమ్మ రవీందర్ మరియు తుమ్మ మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.
మానసిక శారీరక అభివృద్ధికి యోగా ఒక మంచి ఔషధం
RELATED ARTICLES



