తిరుపతి జిల్లా పాండూరు కేంద్రంలో మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం. వరదయ్యపాలెం మండల అధ్యక్షులు నిరూపకు దొరబాబు మాదిగ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి వర్గీకరణ చట్టబద్ధత కై అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎం ఆర్ పి ఎస్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిపట్టు రాఘవయ్య మాదిగ మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉపకులాలు భవిష్యత్ కొరకు, అణగారిన వర్గాల హక్కుల సాధనకై గత 30 సంవత్సరాలుగా అభినవ అంబెడ్కర్, మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం లో అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఈ పోరాటం లో జాతి భవిష్యత్ అయిన షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు సురేష్ మాదిగ, మంద మోహన్ మాదిగ,ఎం ఈ ఎఫ్ నాయకులు సుధాకర్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ నాయకులు నితిన్ మాదిగ, మౌళి మాదిగ, బాలరాజు, బాల మాదిగ,ప్రేమాద్రి మాదిగ, రవితేజ మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు.