TEJA NEWS TV
బీబీపేట్ మండలం యాడవరం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వడ్ల సంగమేశ్వర్ గత ఐదు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సోమవారం రోజున స్ధానిక బిఆర్ఎస్ నాయకులతో ఇంటికీ వెళ్ళి కుటుంబసభ్యులను పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సంధర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ సంగమేశ్వర్ వంటి చురుకైన కార్యకర్త ను కోల్పోవడం ఆయన మరణం బాధాకరమని పార్టీకి తీరని లోటని పార్టీ ఎల్లపుడు అండగా వుంటుందన్నారు కుటుంభానికి భరోసా కల్పించేందుకు అన్ని విధాలుగా సహాకారం అందిస్తామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్ జన్మదినం సందర్భంగా బియ్యం, సరుకులు అందించామన్నారు కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రావు, ఎంపిటిసి లక్కార్స్ రవి, ఉపసర్పంచ్ హరీష్, మాజీ సర్పంచ్లు వెంకటేశం, సొసైటి డైరెక్టర్ కిషన్ రావు,బిఅర్ఎస్ నాయకులు రాజిరెడ్డి, లింగం, సిద్దాగౌడ్, గురువాచారి, సత్యం తదితరులు పాల్గొన్నారు
మాజీ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకుల అందజేత
RELATED ARTICLES