తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
గ్రామ సంఘాల బలోపేతం కావాలంటే గ్రామ సంఘంలోని అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి పతాధికారుల పాత్ర చాలా కీలకమని అడిషనల్ డిఆర్ డిఓ రేణుకా దేవి అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన- గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం రోజు శాంతి మండల సమైక్య సంగెం మండలంలోని 49 గ్రామసంఘాలలోని అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులకు 3 రోజుల పలు అంశాలపై శిక్షణ కార్యక్రమంలో. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుస్తక నిర్వహణ విధిగా నిర్వహించాలని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష యోజన,వ్యక్తిగత భీమా బ్యాంకు రుణాల వడ్డీ లేని రుణాలు,బ్యాంకు లింకేజీ,స్త్రీనిధి రుణాలపై, రుణాల చెల్లింపు సంఘ సభ్యులకు వివరించాలన్నారు. ప్రతి విషయం పైన ఇతరులపై ఆధారపడి మోసపోవద్దని, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే లావాదేవీల పైన అవగాహన వస్తుందని అన్నారు. ప్రతి గ్రామ సంఘంలో జరిగే లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించినప్పుడే గ్రామ సంఘాలలో ఉన్న సంఘాలకు నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిపిఎం యం.దయకర్, ఏపీఎం దుంప్పెటి.కిషన్, యస్ ఆర్ పిలు కె.లక్ష్మి, హెచ్. ప్రమీల,సిసిలు సురేశ్,రాజయ్య,ఏలియ, కార్యాలయ అకౌంటెంట్ సుజాత,కృష్ణ,శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి- అడిషనల్ డిఆర్ డిఓ రేణుకా దేవి
RELATED ARTICLES